వైద్యుల నిర్లక్ష్యం..విడిపోయిన బిడ్డ తల, మొండెం

By రాణి  Published on  21 April 2020 10:53 AM GMT
వైద్యుల నిర్లక్ష్యం..విడిపోయిన బిడ్డ తల, మొండెం

  • ఆపరేషన్ మధ్యలో చేతులెత్తేసిన వైద్యులు

కర్నూల్ జిల్లా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డెలివరీలు చేయాల్సిన గర్భిణీ స్త్రీ ల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇప్పుడు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ సంఘటన వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మిడుతూరు మండలం అలాగనూరుకు చెందిన శ్రీ లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.

Also Read : కేసీఆర్ తాతకు విరాళం..కేటీఆర్ అంకుల్ కు ట్వీట్

అక్కడి వైద్యులు శ్రీలక్ష్మిని పరిశీలించి సిజేరియన్ చేయాలని చెప్పారు. అలా సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో బిడ్డ మొండెం మాత్రమే వచ్చింది. తల మాత్రం తల్లి కడుపులోనే ఉండిపోయిందిం. దీంతో వైద్యులు ఆపరేషన్ మధ్యలో చేతులెత్తేశారు. బయటికి తీసిన మొండాన్ని అలాగే ఉంచి గర్భిణీని వెంటనే అంబులెన్స్ లో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ చేసేంత సామర్థ్యం కలిగిన వైద్యులు లేనపుడు ఎందుకు ప్రసవాలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతుంది. నవమాసాలు మోసి..బిడ్డ పుట్టాక సంతోషం వెల్లి విరియాల్సిన ఆ తల్లి కళ్లు చెమ్మగిల్లాయి. చనిపోయిన బిడ్డను చూసి కనీసం తనివితీరా ఏడ్వలేని స్థితిలో ఉంది. ఆ తల్లికి కడుపుకోత మిగిల్చిన వైద్యులపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read : వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం : బిడ్డకు జన్మనిచ్చి మహిళ మృతి

రెండ్రోజుల క్రితం తెలంగాణ లోని సూర్యాపేటలో కూడా ఓ గర్భిణి కి వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. నడిరోడ్డుపైనే ప్రవసమవ్వగా ఆఖరికి కోదాడ ఎస్సై సహకారంతో సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై రంగంలోకి వచ్చే వరకూ అంబులెన్స్ సిబ్బంది సైతం సరిగ్గా స్పందించలేదు.

Next Story