వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం : బిడ్డకు జన్మనిచ్చి మహిళ మృతి

By రాణి  Published on  20 April 2020 2:19 PM GMT
వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం : బిడ్డకు జన్మనిచ్చి మహిళ మృతి

హైదరాబాద్ శివారు ప్రాంతం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయ(29)కు స్థానిక ఆస్పత్రిలో డెలివరీ అయింది. శిశువుకు జన్మనిచ్చిన అనంతరం విజయకు తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. తల్లి మృతితో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ప్రసవించిన మహిళకు రక్తం ఎక్కించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి తీరుపై బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అచ్యుత్ రావు ఈ మెయిల్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య జూన్ 16 తేదీ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి నోటీసులు జారీ చేశారు.

Also Read : లాక్ డౌన్ పొడిగించకూడదంటే ప్రజలు సహకరించాలి : డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా బాధితులకే కాకుండా తలసేమియా, క్యాన్సర్, గర్భిణీలకు అత్యవసర వైద్యం అందించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన వారికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే మంత్రి ఈటెల ప్రజలు దగ్గర్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ లలో రక్తదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక చిరంజీవి కూడా రక్తదానం చేసి, అభిమానులు కూడా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

Also Read : చంద్రబాబు నాయుడు బర్త్ డే స్పెషల్ సాంగ్

Next Story