కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులకు భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం 27 మంది భద్రతను తొలగిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ భాసరరావు ప్రకటించారు. దీంతో భద్రతా సిబ్బంది మాజీ మంత్రుల నుంచి రిలీవ్ అయ్యారు. ఎ-గ్రేడ్‌ ఉండే మాజీ మంత్రలకు యధావిధిగా భద్రత కొనసాగించారు. బి-గ్రేడ్‌లో ఉండేవారికి మాత్రం ఈ భద్రతను తొలగించారు.

ఇక రాష్ట్రంలో ఎ-గ్రేడ్‌లోఉండే మాజీ మంత్రులు పరమేశ్వర్‌కు జడ్‌ప్లస్‌తో పాటు పైలట్‌, రేవణ్ణకు జడ్‌ కేటగిరి, డికె. శివకుమార్‌కు వై-ప్లస్‌తో పాటు ఎస్కార్ట్‌, జార్‌జ్‌కు వై ప్లస్‌తోపాటు పాటు ఎస్కార్ట్‌, ఎంబి. పాటిల్‌కు జడ్‌ ప్లస్‌ పైలట్‌ కొనసాగనుంది. ఇక బి-శ్రేణిలో ఉంటూ భద్రత కోల్పోయిన వారిలో జమీర్‌ అహ్మద్‌, బండెప్ప కాశంపూర్‌, జిటి దేవేగౌడ, తమ్మణ్ణ, కృష్ణబైరేగౌడ, మనుగూళి,శివశంకర్‌రెడ్డి, రమేష్‌, శ్రీనివాస్‌, నాగగౌడ్‌, వెంకటరావు, ప్రియాంక ఖర్గే, పుట్టరాజు, ఖాదర్‌, మహేష్‌, శివానందపాటిల్‌, వెంకటరవణప్ప, ఎన్‌. మహేష్‌, పుట్టరంగశెట్టి, ఆర్‌.శంకర్‌, తుకారాం, సతీష్‌, రహీంఖాన్‌, జార్కిహోళి, తిమ్మాపుర, జయమాల ఉన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.