జంప్ జిలానీల‌తో షాక్‌లో ఉన్న టీడీపీకి ప్రకాశం జిల్లాలో భారీ షాక్ త‌గల‌నుంది. టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే బలరాం.. రేపు లేదా ఎల్లుండి సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. జిల్లా టీడీపీలో బ‌ల‌మైన నేతగా ఉన్న బ‌ల‌రాం.. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. నేడో, రేపో జ‌గ‌న్‌తో భేటీ కానున్న బ‌ల‌రాం.. టీడీపీని వీడి వైసీపీ కండువా క‌ప్పుకునే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ విష‌య‌మై ఇప్ప‌టికే.. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో క‌ర‌ణం బ‌ల‌రాం, అత‌ని త‌న‌యుడు వెంకటేష్ మంతనాలు కూడా జరిపార‌ని టాక్ న‌డుస్తోంది. ఇదిలావుంటే.. మరీ కాసేపట్లో బ‌ల‌రాం.. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలోని రామకృష్ణపురంలో కార్యకర్తలతో భేటి కానున్న‌ట్లు స‌మాచారం. ఇక.. నిన్న ఉద‌యం క‌దిరి బాబురావు, ఈ రోజు ఉద‌యం మాజీమంత్రి రామ‌సుబ్బారెడ్డి ఇలా ఒక్కొక్క‌రూ పార్టీని వీడుతుండ‌టంతో టీడీపీ నాయ‌కత్వం అయోమ‌యంలో కొట్టుమిట్టాడుతుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story