ఆ సీఐని బదిలీ చెయొద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు !
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 3:48 PM ISTప్రకాశం: కనిగిరి సీఐని బదిలిచేయొద్దంటూ మహిళలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కారు. నిజాయితీకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా, అవినీతిని నిర్మూలించడమే ఆయన చేసిన తప్పా అంటూ ప్రజా సంఘాలు ధర్నా బాట పట్టాయి.
అవినీతిరహిత పాలన అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, దానికి కట్టుబడి పని చేస్తున్న అధికారులను బదిలీలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరి సీఐ సర్వీసులో ఒక్క అవినీతి ఆరోపణనైనా చూపించాలని ప్రజా సంఘాలు ప్రశ్నించాయి.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు సీఐ టీవీవీ ప్రతాప్ కుమార్ కల్పించుకొని వారికి సర్దిచెప్పి ఆందోళనను విరమించేలా చేశారు. ఇలాంటి ఉత్తమ నిజాయితీ అధికారుల కోసం ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలన్నారు.
సీఐని కొందరు అధికార నాయకులు కావలనే బదిలీ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కనిగిరి సీఐ కోసం ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు, ప్రజాసంఘాలు పార్టీలకు అతీతంగా రోడ్డెక్కి నిలబడం ఆయన నిజాయితీకి నాంది పలికేలా చేశాయని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి.