ఆ బరువుతో భరతనాట్యం చేశాను.. వెన్ను భాగం దెబ్బతింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2020 2:22 PM ISTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోన్న సంగతి తెలిసందే. నిన్నమొన్నటి వరకూ కంగనాకు, మహరాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అవుతున్న వివాదాలను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్న ఆమె ప్రస్తుతం తలవి సినిమాకు సంబంధించి విశేషాలను అభిమానులతో పంచుకుంది.
కంగనా ట్వీట్ ప్రకారం.. ఈ సినిమాలో జయలలితలా కనిపించేందుకు ఆమె ఏకంగా 20 కేజీల బరువు పెరిగిందట. అంత బరువుతో భరతనాట్యం చేయడం వల్ల ఆమె వెన్ను భాగం దెబ్బతిందట. సినిమా కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కంగన చాలా కష్టపడిందట. తన సాధారణ బరువుకు వచ్చేందుకు ఏడు నెలల సమయం సరిపోలేదట. పాత్ర పరిపూర్ణత కోసం పనిచేయడం కంటే సంతృప్తి ఏముంటుంది అని రాసుకొచ్చింది. ఇదిలావుంటే.. ఈ సినిమాకు అమలాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.
Next Story