మహారాష్ట్ర తదుపరి సీఎం కంగనా : రామ్‌గోపాల్ వర్మ
By తోట వంశీ కుమార్ Published on 9 Sep 2020 1:57 PM GMTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడు ఏ విషయం పై స్పందిస్తాడో ఎవరికి తెలీదు. తాజాగా బాలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారిన కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం పై వర్మ స్పందించారు. ఖచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్ అవుతుందనిపిస్తోందని అన్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే బాలీవుడ్ వాళ్లందరూ టింబక్టుకు (టింబక్టు అనేది నైజీర్ నదికి దగ్గర ఉండే మలి అనే దేశంలోని ఒక నగరం) మకాం మార్చాలంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసారు. అంతే కాకుండా కరోనా సోకిన భారత్‌కు వ్యాక్సిన్ లేదని, అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్ లేదని పేర్కొన్నారు.
కంగనా ఇటీవల మహా సర్కార్‌కు వ్యతిరేకంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా సుశాంత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌లో పలువురు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది.
ముంబైకి వస్తాను దమ్ముంటే ఆపండి ఛాలెంజ్ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పినట్లుగా బుధవారం ముంబైలో అడుగుపెట్టింది. ఆమె రాకను వ్యతిరేకిస్తూ.. శివసేన కార్యకర్తలు చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు భారీగా తరలి రాగా.. కంగనాకు మద్దతుగా కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. ఇరు వర్గాలు నినాదాలతో హోరెత్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఎయిర్ పోర్టు నుంచి కంగనా ప్రత్యేక గేట్ నుంచి బయటకు వెళ్లడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇంటికి వెళ్లిన కంగనా.. ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేస్తూ.. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పై మాటల దాడి చేసింది.
నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు. నీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకు ఈరోజు ఆర్థమైంది అని కంగనా తెలిపింది. “ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై? ఫిల్మ్ మాఫియాతో పాటు నీవు కలిసిపోయావు, నా ఇంటిని కూల్చివేసి, నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? ఈ రోజు నా ఇల్లు కూల్చివేయబడింది, మీ అహంకారం రేపు విరిగిపోతుంది, ఇది సమయం యొక్క చక్రం, గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు, నీవు నాకు సహాయం చేసావు. కాశ్మీరీ పండితులు ఏమి చేశారో నాకు తెలుసు, కాని ఈ రోజు కూడా నేను భావించాను. అయోధ్యపై మాత్రమే కాకుండా కాశ్మీర్‌పై కూడా సినిమా చేస్తానని ఈ దేశానికి ప్రమాణం చేస్తున్నాను,”అని ఆ వీడియో కంగనా తెలిపింది.