‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సంచలన దర్శకుడు వర్మ పేరు ప్రకటించినప్పటి నుంచే టాక్ హై పిచ్ కు చేరుకుంది. అంతేకాదు…ఈ సినిమాపై వర్మ చేస్తున్నట్లు ట్విట్లు కూడా సినిమా టాక్ ను పెంచాయి. వర్మకు సినిమా తీయడమే కాదు…దానిని మార్కెటింగ్ చేసుకోవడం కూడా బాగా తెలుసు. అదే..లైన్లో సోషల్ మీడియా  ద్వారా ముఖ్యంగా ఆయన ట్విట్ల ద్వారా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను మార్కెటింగ్ చేస్తూ వస్తున్నాడు. పవన్ కల్యాణ్ వేషాధారణలో ఉన్న వ్యక్తిపై ట్విట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక..’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ రేపు ఉదయం  9గంటల 36 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విట్ చేశాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.