రెండో ప్రియుడితో కలిసి ఆడ శిశువుకు జన్మనిచ్చిన నటి..!
By అంజి Published on 10 Feb 2020 4:01 AM GMT
కట్టుకున్న భర్తను కాదని గత కొంత కాలంగా రెండో ప్రియుడితో సహ జీవనం చేస్తున్న నటి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు శుభ వార్త చెప్పింది. గత ఏడాది అక్టోబర్ 1న గర్భం దాల్చినట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఆ నటి ఆదివారం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు సంబంధించిన పాద ముద్రల ఫోటోలను షేర్ చేసింది.
కాగా, బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ తన మొదటి బర్త అనురాగ్ కశ్యప్‌తో విడాకులు తీసుకున్న తరువాత గై హెర్ష్‌బర్గ్‌తో డేటింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గయ్ హెర్ష్‌బార్గ్‌తో కలిసి తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నానంటూ గతంలో ప్రకటించింది కూడా.
అదే సమయంలో పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తూ, బిడ్డకు జన్మనివ్వాలంటే పెళ్లి అనే ఒక్క బంధంతోనే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నామ్‌కే వాస్తేగా జరిగే పెళ్లిళ్లతో ఆలు మగల వైవాహిక జీవితం ప్రేమల మధ్య కొనసాగుతుందని తాను అనుకోవడం లేదని, పెళ్లి లేకున్నా ఆడ మగ మధ్య బలమైన నమ్మకం ఉంటే చాలంటూ తన భర్తతో విడాకుల సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పుకొచ్చింది.
అయితే, కల్కి కోచ్లిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోను బట్టి ఆమె తన ప్రియుడు గై హెర్ష్‌బర్గ్‌తో కలిసి చాలా సంతోషంగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. హెర్ష్‌బర్గ్ తనకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడంటూ కూడా ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇప్పటికే వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.