కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  22 July 2020 10:13 AM IST
కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలోవ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా, తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకడంతో కడియం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అలాగే కడియం డ్రైవర్‌, పీఏ, గన్‌మెన్‌లకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివేకానంద్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌గుప్తా, సతీష్‌ కుమార్‌లకు కరోనా సోకింది. అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కూడా కరోనా బారిన పడ్డారు.ఆయన చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు. అలా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులను సైతం కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు.

Next Story