'కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి..' వీడియో సాంగ్
By తోట వంశీ కుమార్ Published on 23 July 2020 3:04 PM ISTకోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన కంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో సూర్య. పాత్ర కోసం ఎలాంటి సాహాసానికైనా సిద్దపడే అతి కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. 'గురు' ఫేం సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సూరరై పోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ఆర్.గోపినాథ్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా.. నేడు (జూలై 23) సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి 'కాటుక కనులే' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ వీడియో ప్రోయోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో అపర్ణ బాలమురళి, సూర్య కెమెస్ట్రీ అభిమానులను అలరిస్తోంది. జీవీ ప్రకాష్ అందించిన స్వరాలకు తెలుగులో భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి.. మాటలన్నీ మరిచిపోయా నీళ్లే నమిలేసి.. నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా.. రాతిరంతా నిదురపోని అల్లరే నీదిరా..’’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకోగా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది.