ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‘శరద్‌ అర్వింద్‌ బాబ్డే’ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కోవింద్‌ మంగళవారం సంతకం చేశారు. అయితే నవంబర్‌ 18న ఆయన 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్‌ 23 వరకు జస్టిస్‌ బాబ్డే సీజేగా కొనసాగనున్నారు.

అయితే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘రంజన్‌ గొగొయి’ పదవీకాలం నవంబర్‌ 17తో ముగియనుంది. దీంతో తన తర్వాత సీనియార్టీలో ఉన్న జస్టిస్‌ బాబ్డేను, రంజన్ గొగొయి ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. నిబంధనల ప్రకారం ఈ ప్రతిపాధనను న్యాయశాఖఅధికారి..ప్రధానమంత్రికి అందించారు. అనంతరం ప్రధాన మంత్రి రాష్ట్రపతికి అందించారు. రాష్ట్రపతి ఆమోదంతో జస్టిస్‌ బాబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.