విదేశీయులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోటోలను పట్టుకుని వీధుల్లో నిరసనలు తెలియజేస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేయడమే కాకుండా #NoJustice4SSRNoVote అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ ఉన్నారు. ”#NoJustice4SSRNoVote@narendramodi
@AmitShah The world is demanding for justice for SSR. We want justice Modi Ji, the world wants justice for Sushant Singh Rajput. Thank you Nigeria @shwetasinghkirt @nilotpalm3 @smitaparikh2 @anujakapurindia See How much the world love our Sushant”.(sic) అంటూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలని ప్రపంచం మొత్తం డిమాండ్ చేస్తోందని.. మోదీ గారు న్యాయం జరిగేలా చూడండి అంటూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. నైజీరియా ప్రజలు కూడా సుశాంత్ కు న్యాయం జరగాలని కోరుతూ ఉన్నారని ఈ ట్వీట్ల ద్వారా వెల్లడించారు.
నిజ నిర్ధారణ:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలంటూ విదేశీయులు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అక్టోబర్ 2020న ‘CNN‘ ఓ రిపోర్టును పబ్లిష్ చేసింది. ‘Reform Police Disband SARS’ అంటూ కొందరు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. నైజీరియాలో ఈ నిరసనలు చేపట్టారు. కిడ్నాప్ లు, వేధింపులు, బెదిరింపులు లాంటి ఎన్నో దారుణాలు పోలీసు యూనిట్ అయిన స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్(SARS) కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయని.. అందులో సమూల మార్పులు రావాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు చేపట్టారు.
వైరల్ అవుతున్న పోస్టుకు ‘CNN‘ ఇమేజ్ కు ఉన్న తేడాను గమనించవచ్చు ..
‘News Africa‘ మీడియా సంస్థ కూడా నైజీరియాలో స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్ దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయని.. దానికి చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారని ప్రచురించింది. పలువురు ప్రముఖులు కూడా స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్ ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
నైజీరియాలో జరిగిన ఆందోళనలకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోటోను ఉంచి మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. పోలీసుల ఆగడాలు నశించాలని నైజీరియాలో చేస్తున్న ఆందోళనలకు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలంటూ చేస్తున్న ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు.
వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.