జూబ్లిహిల్స్ లో దారుణం.. చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య
By Newsmeter.Network Published on 4 Feb 2020 9:07 PM IST
జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేసి శవాన్ని జవహార్‌నగర్‌లోని ఓ ఇంట్లో పడేశారు. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడిని బోరబండ రామారావునగర్‌కు చెందిన చేపల వ్యాపారంతో పాటు, రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రమేశ్‌గా గుర్తించారు.
రెండు రోజుల క్రితం రమేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.90లక్షలు డిమాండ్ చేయగా కుటుంబ సభ్యులు.. నిన్న ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా నేడు జూబ్లీహిల్స్ లోని కళ్యాణ్ నగర్ లో ఓ ఇంట్లో గోనె సంచిలో రమేష్ మృతదేహాం దొరికింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
యువకుడిని విచక్షణ రహితంగా నరికి హత్యNext Story