ప‌నుల‌ను పంచుకుందాం అంటూనే.. ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2020 12:06 PM IST
ప‌నుల‌ను పంచుకుందాం అంటూనే..  ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్‌

లాక్‌డౌన్‌ స‌మ‌యంలో ఇంటి ప‌నుల్లో భార్య‌ల‌కు స‌హాయం చేయాల‌ని 'అర్జున్‌రెడ్డి' చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ వంగ స‌రికొత్త చాలెంజ్ 'బీ ది రియ‌ల్ మ్యాన్' కు తెరతీసాడు. దీనికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని నామినేట్ చేశాడు. ద‌ర్శ‌క దీరుడు జ‌క్క‌న్న కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసి జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు ఈ ఛాలెంజ్‌ను విసిరాడు.

కాగా.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'ఛాలెంజ్ యాక్సెప్టెడ్ జ‌క్క‌న్న‌' అంటూ స‌మాధానం ఇచ్చిన 24 గంట‌ల్లోనే త‌న ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇంటి ప‌నుల్లో భార్యకు సాయం చేసిన వీడియోను ఎన్టీఆర్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. రెండు చేతుల‌తో గిన్నెలు శుభ్రం చేశాడు. చీపురు ప‌ట్టి రీల్ మ్యాన్ కాదు.. రియ‌ల్ మ్యాన్ అనిపించుకున్నాడు.

"మన ఇంట్లో ప్రేమలు, అప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందామని" పిలుపునిచ్చారు. మనం చేసిన పనులను ఇతరులతో షేర్‌ చేయడం చాలా ఫన్‌గా ఉంటుందన్నారు. అంతేకాదండోయ్.. ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఈ చాలెంజ్‌కు అగ్ర‌క‌థానాయ‌కులు చిరంజీవి, నాగార్జున, వెంక‌టేష్‌, నాగార్జునల‌తో పాటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ను నామినేట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ గా మారింది. మ‌రీ ఎన్టీఆర్ విసిరిన ది రియ‌ల్ మ్యాన్ ను ఛాలెంజ్‌ను టాలీవుడ్ అగ్ర‌క‌థానాయులు ఎలా చేస్తారో చూడాలి మరీ.



Next Story