భ‌ర్త‌తో విడాకులు.. స్పందించిన క‌ల‌ర్స్ స్వాతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2020 6:46 AM GMT
భ‌ర్త‌తో విడాకులు.. స్పందించిన క‌ల‌ర్స్ స్వాతి

స్వాతి అంటే.. గుర్తుకు ప‌ట్ట‌క పోవ‌చ్చు.. కానీ క‌ల‌ర్స్ స్వాతి అంటే తెలుగు ప్రేక్ష‌కులు ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారూ.. బుల్లితెర పై యాంక‌ర్‌గా త‌న కెరీర్ మొద‌లు పెట్టిన స్వాతి.. క‌ల‌ర్స్ ప్రోగాంతో మంచి పేరు తెచ్చుకుంది. దీంతో అంద‌రూ ఆమెను క‌ల‌ర్స్ స్వాతి అనే పిలుస్తారు. బుల్లితెర నుంచి నెమ్మ‌దిగా వెండి తెర‌పై అడుగుపెట్టి తానెంటో నిరూపించుకుంది‌. 'కార్తికేయ', 'స్వామి రారా' సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ముద్ర వేసింది.

కాగా.. రెండేళ్ల క్రితం వికాస్ అనే బిజినెస్‌మెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవ‌ల ఆమె తన భ‌ర్త నుంచి విడిపోయిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. సోష‌ల్ మీడియాలో స్వాతి త‌న భ‌ర్త ఫోటోలు డిలీట్ చేసింది. దీంతో స్వాతి విడాకులు తీసుకోనుంద‌నే వార్త‌లు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేశాయి. గతంలో ఇలియానా, సనా ఖాన్ వంటి క‌థానాయిక‌లు.. తమ బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడిపోయిన తరువాత.. వారితో కలిసున్నప్పుడు దిగిన ఫోటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. తాజాగా స్వాతి సైతం వికాస్ తో కలిసున్న చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసేయడంతో స్వాతి విడాకులు తీసుకోనుంది అనే వార్త‌లు పుట్టుకొచ్చాయి.

కాగా.. వాటిపై స్వాతి స్పందించింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వాటికి చెక్ పెట్టింది. హ‌రీ పోట‌ర్‌లోని డైలాగ్‌ను త‌న ఇన్‌స్టాలో రాసి పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా భ‌ర్త‌తో తానున్న ఫొటోల‌ను ఆర్కివ్‌లో దాచుకున్న విష‌యాన్ని వీడియో ద్వారా తెలియ‌జేశారు.

ఈ వీడియోతో స్వాతి.. త‌న‌ పై వ‌స్తున్న రూమ‌ర్లకు గ‌ట్టిగానే స‌మాధానం చెప్పింది.

Next Story
Share it