క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ లేక‌పోయినా.. జాబ్ రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tips to get Jobs. జాబ్ రావాలంటేకమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఇంపార్టెంట్ కాదు.అదెలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

By Medi Samrat  Published on  9 April 2021 1:57 PM IST
Job tips

కష్టపడి నిజాయితీగా పనిచేసే వాడికంటే కబుర్లు చెప్పేవాళ్ల రోజులే బాగున్నాయి. నేను ఎంతో కష్ట పడతాను. నిజాయితీగా పని చేస్తాను. కానీ కబుర్లు చెప్పేవాడు. ఇంగ్లీష్ లో మాట్లాడి హడావిడి చేసేవాడికే అవకాశాలు వస్తాయి. నాకు మాత్రం అవకాశాలు రావడం లేదు. నాకే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ప్రపంచం మొత్తాన్ని దున్నేసేవాడిని, భూమి లోపలికి తొవ్వుకుంటూ వెళ్లి ఎర్త్ ఇన్నర్ కోర్ దగ్గర్ కూర్చొని చలి కాచుకునేంత టాలెంట్ ఉంది. కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల నేనిలా ఉండి పోతున్నాను. అని మీరిలా బాధపడుతుంటే ఇది మీకోసమే

చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లే ఎదగలేకపోతున్నామని బాధపడుతుంటారు. అయితే అందరూ అనుకున్నట్లుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఇంపార్టెంట్ కాదు.అదెలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒక ఆఫీస్ లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. బయట ఐదుగురు కూర్చొని ఉన్నారు. అందులో నలుగురికి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇంకో వ్యక్తికి ఎక్స్ పీరియన్స్ కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంది. ఆ అబ్బాయి అందరితో ఇంగ్లీష్ లో చాలా ఫ్లూయంట్ గా, హడావిడిగా మాట్లాడుతున్నాడు. దీంతో ఆ నలుగురు వీడు బాగా హడా విడి చేస్తున్నాడు. పని రాదు పాడు రాదు. ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అప్పుడే భలే హడావిడి చేస్తున్నాడే' అని అనుకున్నారు. అందరూ ఇంటర్వ్యూకి వెళ్లొచ్చారు. ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. మిగిలిన నలుగురికి జాబ్ రాలేదు. దీంతో హడావిడి చేసినోడికి జాబ్ ఇచ్చారు. ఇంగ్లీష్ మాట్లాడాడుగా వాళ్లు పడిపోయారని తిట్టుకున్నారు. కానీ నిజానికి లోపల జరిగిందేంటో అనేది ఎవరికీ తెలియదు. చాలా తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్నా ఆ అబ్బాయికి జాబ్ రావడానికి కారణం ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంతకంటే కాదు. ఈ అబ్బాయి ఆ ఇంటర్వ్యూకి వెళ్లడానికి రెండు నెలల ముందు నుంచే ఆ కంపెనీ లో ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రాజెక్ట్ ల మీద వర్క్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ తో ఓ పోర్ట్ పోలియో తయారు చేసుకున్నాడు. పాత ఆఫీస్ లో 6 నెలల పాటు ఏం చేశాడో చెప్పకుండా.. వాళ్లకు ఎలాంటి పని చేసే ఉద్యోగులు కావాలో తెలుసుకున్నాడు. సరిగ్గా సదరు సంస్థ యాజమాన్యం ఏ ప్రాజెక్ట్ కోసం ఎంప్లాయిస్ ను చూస్తుందో ఆ అబ్బాయి కూడా అలాంటి పోర్ట్ పోలియోని తయారు చేశాడు. దీంతో సదరు యాజమాన్యం ఆ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చింది. మిగిలిన వాళ్లకి ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే స్కిల్స్ ఉన్నా జాబ్ రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో

1.యాక్టీవ్ గా ఉండాలి.

మీరు ఇంటర్వ్యూలకు వెళ్లడంలో యాక్టీవ్ గా ఉండాలి. వారంలో ఎక్కువ ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే మీరు ఎలాంటి జాబ్ కోరుకుంటున్నారు. మీ స్కిల్స్ ను బట్టి అంత శాలరీ వస్తుందా? లేదా? మీ బలాలేంటి? బలహీనతలేంటి? అనేది త్వరగా తెలుసుకోవచ్చు. దీంతో టైమ్ వేస్ట్ కాదు. మీరు అనుకున్న జాబ్ ను త్వరగా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇంటర్వ్యూ అంటే వారానికి ఒకటి, నెలకు మూడు అలా కాకుండా వారానికి సరిపడా ఇంటర్వ్యూలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.

2. జాబ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారా?

ఇంటర్వ్యూ చేసే వాళ్లు ఎంప్లాయిస్ లో అభిరుచిని, ఉత్సాహాన్ని చూపిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలో ఉత్సాహం ఉండండి. మీకు రకరకాల కారణాల వల్ల రాని ఉద్యోగం సైతం మీ ఉత్సాహం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో ప‌ర్ఫామ్ చేయకపోయినా ట్రైనింగ్ ఇచ్చేందుకు కంపెనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి డోంట్ బి లేజీ.

3. మిమ్మల్ని మీరు నమ్మండి

ప్రపంచంలో అతి పెద్ద జబ్బు క్యాన్సరో, కరోనానో కాదు. కాన్ఫిడెంట్. 100 కి 99 మందిలో కాన్ఫిడెంట్ లెవల్స్ లేకపోవడం. దీంతో తమని తాము చాలా తక్కువ అంచనా వేసుకుంటారు. అలా తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల మీరు మీ రంగంలో నిష్ణాతులైనా కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల రాణించలేరు. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ బలాలేంటో తెలుసుకోండి. మీకు ఆ జాబ్ ఇస్తే కంపెనీకి వచ్చే లాభాలేంటో రెజ్యూమ్ లో ఎక్స్ ప్లెయిన్ చేయండి. రెజ్యూమ్ లో యాడ్ చేయడమే కాదు. అందుకు తగిన సామర్ధ్యం మీలో ఉందా? లేదా అనేది చెక్ చేసుకోవాలి.

4. రెజ్యూమ్ లో కీ పాయింట్స్

చాలా మంది కాపీ పేస్ట్ చేసి రెజ్యూమ్ ను రెడీ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటారు. అలా కాకుండా మీ జాబ్ తగ్గట్లు కీ పాయింట్స్ అన్నీ ఫస్ట్ పేజీలో ఉండేలా చూసుకోండి. దీంతో పాటూ మీ జాబ్ కు సంబంధించి అప్ కమింగ్ టెక్నాలజీ ఏంటో తెలుసుకొని, కోచింగ్ తీసుకోవాలి. కోర్స్ గురించి మెన్షన్ చేయండి.

5. రీసెర్చ్ అవసరం

మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ఆఫీస్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిలో యజమాని లేదా సీఈఓ ఎవరు? ఆ సంస్థ లక్ష్యాలు, భవిష్యత్ లో ఏం చేయాలని అనుకుంటుంది? కంపెనీ లో జాబ్ ఎలా ఉంటుంది? అందులో మీ పాత్ర ఎంత ఉంది? అనే విషయాల్ని తెలుసుకుంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు.

6. మీ జాబ్ ఎక్స్ పీరియన్స్ గురించి చర్చించండి

చాలా మంది ఇంటర్వ్యూలో జాబ్ కు తగిన స్కిల్స్ గురించి రెజ్యూమ్ లో ఎంటర్ చేస్తారే తప్పా..! మీ జాబ్ కు సంబంధించిన ఇతర టెక్నాలజీపైన వర్క్ చేసే సామర్ధ్యం ఉందని చెప్పే ప్రయత్నం చేయరు. అలా ఎంట్రీ చేస్తే స్కిల్స్ ఎక్కువగా ఉంటే అంతే జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో జాబ్ ఇవ్వరని అనుకుంటారు. కానీ మీ స్కిల్స్ ఎంట్రీ చేస్తే మీ స్కిల్స్ కు తగ్గ డిజిగ్నేషన్ ను సంపాదించవచ్చు. అందుకు తగ్గ శాలరీని డ్రా చేసుకోవచ్చు.

7. నెట్ వర్క్ చాలా అవసరం

మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ జాబ్ కు సంబంధించిన వారితో నెట్ వర్క్ ఏర్పరుచుకోవాలి. ఆ నెట్ వర్క్ లో ఎవరైనా మిమ్మల్ని రిఫర్ చేస్తే వాళ్ల పేరు, కంపెనీ, డిజిగ్నేషన్, కుదిరితే కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయండి. అలా చేయడం వల్ల జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ జాబ్ నెట్ వర్క్ సంస్థ లింక్డిన్ తెలిపింది. కాబట్టి పైన మనం తెలుసుకున్న ఈ టిప్స్ ఫాలో అవ్వండి జాబ్ సంపాదించండి. ఆల్ ది బెస్ట్.


Next Story