యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు అలర్ట్. ఇవాళ సివిల్ పరీక్షలకు సంబంధించి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By అంజి Published on 22 Jan 2025 4:00 PM ISTయూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు అలర్ట్. ఇవాళ సివిల్ పరీక్షలకు సంబంధించి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు యూపీఎస్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు సంబంధించి 150 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ పరీక్షకు కూడా ఫిబ్రవరి 11వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా దాని సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు కూడా ఉంది. ఓబీసీ, ఇతర అభ్యర్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుకుల ఫీజు మినహాయింపు ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 400 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి.
వీటికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే మెయిన్స్ రాసేందుకు అనుమతి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించాక ఇంటర్వూ నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అలాగే హైదరాబాద్, విజయవాడలో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి.