తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్‌లు విడుదల చేసిన వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల నిర్వహణకు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
దీని ప్రకారం.. వ్యవసాయ, సహకార శాఖలో (148 పోస్టులు) అగ్రికల్చర్ ఆఫీసర్‌ల ఖాళీల భర్తీకి ఏప్రిల్ 25, 2023 తేదీన పరీక్ష నిర్వహించబడుతుంది. పరిపాలనా కారణాల వల్ల వ్యవసాయ, సహకార శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని ఫిబ్రవరి 2, 2023 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సోమవారం తెలియజేసింది . మరిన్ని వివరాల కోసం: https://www.tspsc.gov.in ని సందర్శించండి
అలాగే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల (18 పోస్టులు) పరీక్ష మే 7న నిర్వహించబడుతుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్లకు (247 ఖాళీలు) పరీక్ష మే 13, 2023న నిర్వహించబడుతుంది.
కమీషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద ఫిజికల్ డైరెక్టర్లు (128 ఖాళీలు), ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద లైబ్రేరియన్లు (71) కోసం పరీక్ష మే 17, 2023న నిర్వహించబడుతుంది.