TSPSC: 547 ఉద్యోగాల ఫలితాలు విడుదల

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల భర్తీకి 6 జాబ్‌ నోటిఫికేషన్‌ కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

By అంజి  Published on  17 Feb 2024 6:40 AM IST
Tspsc, Result, Jobs, Telangana Government,Job Recruitment

TSPSC: 547 ఉద్యోగాల ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల భర్తీకి 6 జాబ్‌ నోటిఫికేషన్‌ కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ (టీబీపీవో), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఇంటర్‌ విద్యలో లైబ్రేరియన్‌, రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్‌సీ శుక్రవారం నాడు విడుదల చేసింది.

మెరిట్‌ ప్రకారం.. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాలను అందుబాటులో ఉంచింది. త్వరలోనే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. 547 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇవ్వగా, 2023 మే, జూన్‌, జులై నెలల్లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల జనరల్‌ ర్యాంకు జాబితాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Next Story