ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ వ‌చ్చేశాయ్‌

TSLPRB Announced SI and Constable events dates.ఎస్సై, కానిస్టేబుల్ ఫిజిక‌ల్ టెస్టుల‌పై టీఎస్ఎల్‌పీఆర్‌బీ కీల‌క ప్ర‌క‌ట‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2022 6:27 AM GMT
ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ వ‌చ్చేశాయ్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఫిజిక‌ల్ టెస్టుల‌పై టీఎస్ఎల్‌పీఆర్‌బీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. డిసెంబ‌ర్ 8 నుంచి అభ్య‌ర్థుల‌కు PMT, PET టెస్టుల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పోలీస్ నియామ‌క మండ‌లి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను 23 నుంచి 25 ప‌నిదినాల్లో పూర్తి చేయ‌నున్నారు.

అభ్య‌ర్థులు న‌వంబ‌ర్ 29 నుంచి డిసెంబ‌ర్ 3 అర్థ‌రాత్రి వ‌ర‌కు www.tslprb.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కానట్లయితే అభ్యర్థులు support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు కలిపి పీఎంటీ, పీఈటీల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్‌-2 దరఖాస్తును అందజేశారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు బోర్డు ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తించ‌నున్నాయి.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో ఈవెంట్స్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.Next Story