గ్రూప్‌-4కు భారీ స్పంద‌న.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయంటే..?

TS Group 4 application approaching 5 lakhs.గ్రూప్‌-4 రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్‌కు నిరుద్యోగుల నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2023 5:54 AM GMT
గ్రూప్‌-4కు భారీ స్పంద‌న.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయంటే..?

తెలంగాణ రాష్ట్రంలో విడుద‌లైన గ్రూప్‌-4 రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్‌కు నిరుద్యోగుల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. బుధ‌వారం నాటికి ద‌ర‌ఖాస్తుల సంఖ్య 5 ల‌క్ష‌ల‌కు చేరువైంది. డిసెంబ‌ర్ 30 నుంచి ఆన్‌లైన్‌లో గ్రూప్‌-4 ద‌ర‌ఖాస్తులను స్వీక‌రిస్తుండగా 18 రోజుల్లో 4,97,056 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. జ‌న‌వ‌రి 30 వ తేదీ అంటే మ‌రో 11 రోజులు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న నేప‌థ్యంలో ద‌ర‌ఖాస్తుల సంఖ్య 8 ల‌క్ష‌ల‌కు చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

గ్రూప్ -4 నోటిఫికేష‌న్‌లో భాగంగా 8,039 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 429 జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియ‌ర్ ఆడిట‌ర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి.

జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు (429) : ఆర్థిక శాఖ‌లో 191, పుర‌పాల‌శాఖ‌లో 238 పోస్టులు ఉన్నాయి.

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు(6,859).. వ్య‌వ‌సాయ‌శాఖ‌లో 44, బీసీ సంక్షేమ‌శాఖ‌లో 307, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో 72, అట‌వీశాఖ‌లో 23, ఆర్థిక‌శాక‌లో 46, వైద్య‌-ఆరోగ్య‌శాఖ‌లో 338, ఉన్న‌త విద్యాశాఖ‌లో 742 పోస్టులు ఉన్నాయి. హోంశాఖ‌లో 133, నీటిపారుద‌ల శాఖ‌లో 51, కార్మిక‌శాఖ‌లో 128, మైనార్టీ సంక్షేమ‌శాఖ‌లో 191, పుర‌పాల‌క శాఖ‌లో 601, పంచాయ‌తీరాజ్ శాఖ‌లో 1245, రెవ్యెన్యూ శాఖ‌లో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖ‌లో 474, సెకండ‌రీ విద్యాశాఖ‌లో 97, ర‌వాణాశాఖ‌లో 20, గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌లో 221, మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ‌లో 18, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ‌లో 13 పోస్టులు ఉన్నాయి.

జూనియ‌ర్ ఆడిట‌ర్ పోస్టులు 18, వార్డు ఆఫీస‌ర్ పోస్టులు 1862 మొత్తం 9,168 పోస్టులు ఉన్నాయి.

Next Story