తెలంగాణలో మరో 2,391 ఉద్యోగాలు

Ts Govt Green Signal For 2391 Jobs. తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.

By Medi Samrat
Published on : 27 Jan 2023 6:14 PM IST

తెలంగాణలో మరో 2,391 ఉద్యోగాలు

తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్లో వెల్లడించారు. ఇందులో డిగ్రీ, కాలేజీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీసీ గురుకులాల్లో 1499, పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులు భర్తీకి అనుమతిచ్చింది. ఈ ఖాళీ పోస్టులను టీఎస్ పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డ్, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేస్తుందని చెప్పారు. 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story