7,267 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ.
By - అంజి |
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తి ఉండి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీటీ, టీజీటీ, వార్డెన్ (మేల్, ఫీమేల్), స్టాఫ్ నర్స్ (ఫీమేల్) తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా పాసైన వారు అర్హులు. పూర్తి వివరాల కోసం nests.tribal.gov.inను విజిట్ చేయండి.
ప్రిన్సిపల్ - 225, పీజీటీ - 1460, హాస్టల్ వార్డెన్ (మేల్) - 346, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్) - 228, అకౌంటెంట్ - 61, స్టాఫ్ నర్స్ (ఫీమేల్) -550, టీజీటీ - 3962, హాస్టల్ వార్డెన్ (ఫీమేల్) - 289, ల్యాబ్ అటెండెంట్ - 146 పోస్టులు ఉన్నాయి.
వయోపరిమితి: ప్రిన్సిపల్ - 50 ఏళ్లు, పీజీటీ - 40 ఏళ్లు, టీజీటీ - 35 ఏళ్లు, అకౌంటెంట్ - 30 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్ - 30 ఏళ్లు, హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్ - 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 30 ఏళ్లు.
జీతం: ప్రిన్సిపల్ - రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు, పీజీటీలకు రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు, టీజీటీలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు, అకౌంటెంట్ రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు, ల్యాబ్ అటెండెంట్ రూ.18,000 నుంచి రూ.56,900 వరకు, హాస్టల్ వార్డెన్ రూ.29,200 నుంచి రూ.92,300 వరకు, ఫీమేల్ స్టాఫ్ నర్స్‌లకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిన్సిపల్ పోస్టుకు రూ.2500, పీజీటీ, టీజీటీ పోస్టులకు రూ.2,000, నాన్ టీచింగ్ పోస్టులకు రూ.1500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.