రైల్వేలో 3,058 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులుకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
By - అంజి |
రైల్వేలో 3,058 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులుకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి నవంబర్ 29 వరకు అవకాశం ఉంది. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు రూ.250. పూర్తి వివరాల కోసం www.rrbcdg.gov.inను విజిట్ చేయండి.
పోస్టులు
కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ (2424 పోస్టులు)
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (394 పోస్టులు)
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (163 పోస్టులు)
ట్రైన్స్ క్లర్క్ (77 పోస్టులు)
అర్హత ప్రమాణాలు
విద్యార్హత: కనీసం 50% మార్కులతో 12వ తరగతి (+2 స్టేజ్) లేదా తత్సమానం (SC, ST, PwBD, మాజీ సైనికులు మరియు ఉన్నత అర్హతలు ఉన్నవారికి 50% మార్కుల అవసరం తప్పనిసరి కాదు).
టైపింగ్ నైపుణ్యం: జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు (కంప్యూటర్‌లో ఇంగ్లీష్ లేదా హిందీలో ప్రావీణ్యం) అవసరం.
వయోపరిమితి: జనవరి 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు.
అటు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 103 పోస్టులు న్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హతగల అభ్యర్థులు నంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి వయస్సులో మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష (సీబీటీ -1, సీబీటీ -2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.