దేశంలోని 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పత్తి యూనిట్లలో సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగం సహా 51 కేటగిరీల్లో 6,180 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళ ఒక్క రోజే (జులై 28) సమయం ఉంది. గ్రేడ్-1 180 టెక్నీషియన్ పోస్టులు, గ్రేడ్ - 3 కింద 6000 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. గ్రేడ్-1 పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ డిగ్రీ (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ చదివి ఉండాలి). గ్రేడ్ -3 పోస్టులుక ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య, గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. గ్రేడ్-1 పోస్టులకు నెలకు రూ.29,200, గ్రేడ్-3 పోస్టులకు రూ.19,900 వేతనం అందుతుంది. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఈబీసీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.