2,569 పోస్టులు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులో 2,569 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి నేడే ఆఖరు తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

By -  అంజి
Published on : 10 Dec 2025 7:19 AM IST

Junior Engineer posts, Railway Recruitment Board, Jobs

2,569 పోస్టులు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులో 2,569 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి నేడే ఆఖరు తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. 18 - 33 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హుల. రిజర్వేషన్‌ గల వారికి వయస్సులో సడలింపు ఉంటుంది.

రాతపరీక్ష (సీబీటీ -1, సీబీటీ -2), సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు జీతం రూ.35,400 ఉంటుంది. (సేఫ్టీ & నాన్-సేఫ్టీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ సూపర్‌వైజర్ & మెటలర్జికల్ సూపర్‌వైజర్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంది. పూర్తి వివరాల కోసం www.rrbcdg.gov.inను విజిట్‌ చేయండి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

- ముందుగా మీ ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ను విజిట్‌ చేయండి.

- RRB JE 2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌పై క్లిక్‌ చేయండి.

- మీ ఈమెయిల్‌ లేదా మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రర్‌ చేసుకోండి.

- వ్యక్తిగత, విద్యా వివరాలతో ఫారమ్‌ నింపండి.

- ఫొటో, సంతకం, పత్రాలను అప్‌లోడ్‌ చేయండి.

- నవంబర్‌ 30, 2025 లోపు రుసుము చెల్లించి దరఖాస్తును సమర్పించండి.

Next Story