నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 199 పోస్టుల భ‌ర్తీకి టిమ్స్ నోటిఫికేష‌న్

TIMS Gachibowli notification released for recruitment.తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో 199 పోస్టుల భ‌ర్తీకి టిమ్స్ నోటిఫికేష‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2021 5:28 PM IST
TIMS

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. నాన్‌ క్లినికల్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 199 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటి నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, డైటీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు ఏప్రిల్‌ 16, 17, 19వ తేదీల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కేటగిరిల వారీగా వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫారం https://dme.telangana.gov.in/లో అందుబాటులో ఉంటుందని ప్రకటనలో తెలిపారు.

ఖాళీల వివరాలిలా ఉన్నాయి..

ప్రొఫెసర్లు-12, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-23, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-22, మెడికల్‌ ఆఫీసర్‌-94, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌(గ్రేడ్‌-2)-1, అసిస్టెంట్‌ డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌/హెడ్‌ నర్సు-6, స్టాఫ్‌ నర్సులు-32, డైటీషియన్‌-1, ఫార్మసిస్ట్‌-8 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కూడా అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని స్పష్టం చేశారు.


Next Story