టెన్త్‌ అర్హతతో 25,487 పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది.

By -  అంజి
Published on : 27 Dec 2025 9:59 AM IST

SSC, constable posts, central forces, BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB, GD constable

టెన్త్‌ అర్హతతో 25,487 పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. టెన్త్‌ పాసై, 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1105 ఉన్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, పీఎస్‌టీ/ పీఈటీ/ మెడికల్‌ టెస్ట్, డీవీ ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ ను విజిట్‌ చేయండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తన అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో ఎస్‌ఎస్‌సీ జీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2026ను విడుదల చేసిన విషయం తెలిసిందే. BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBలలో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టుల 25487 ఖాళీలను భర్తీ చేయడం SSC GD 2026 నోటిఫికేషన్ లక్ష్యం.

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్‌ (GD) ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. బీఎస్ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం https://sss.gov.in/ను విజిట్‌ చేయండి.

అర్హతలు: 01-01-2026 నాటికి 18 నుంచి 23 ఏళ్‌ల వయసు (రిజర్వేషన్‌ బట్టి సడలింపు), టెన్త్‌ ఉత్తీర్ణ సాధించాలి. అప్లికేషన్‌ ఫీజు రూ.100. NCC 'A' సర్టిఫికెట్‌ ఉంటే 2 శాతం, NCC 'B'కి 3 శాతం, NCC 'C'కి 5 శాతం మార్కులను జత చేస్తారు. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, పీఈటీ, పీఎస్‌టీ ఆధారంగా ఎంపిక చేస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమానం పూర్తి చేసిన అభ్యర్థులు డిసెంబర్ 1 - డిసెంబర్ 31, 2025 మధ్య అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inని సందర్శించిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. CBT పరీక్షను ఫిబ్రవరి-ఏప్రిల్ 2026 మధ్య తాత్కాలికంగా నిర్వహించవచ్చు.

Next Story