TSPSC కీలక నిర్ణయం, గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 March 2024 7:30 PM ISTTSPSC కీలక నిర్ణయం, గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ఉద్యోగ నియమాక పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులకు మరో రెండ్రోజుల పాటు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పోస్టు భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ పోస్టులకు గాను ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది టీఎస్‌పీఎస్సీ. బుధవారం వరకు గ్రూప్-1 కోసం 2.7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అయితే గురువారం సాయంత్రం 5 గంటలకే గ్రూప్-1 దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ క్రమంలోనే ఇంకా ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోలేకపోయి ఉంటే వారికి మరోసారి అవకాశం కల్పించింది టీఎస్‌పీఎస్సీ. మరో రెండ్రోజుల పాటు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు ప్రకటన చేసింది టీఎస్‌పీఎస్సీ. ఇక గ్రూప్-1 పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ https://www.tspsc.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
గ్రూప్-1 పరీక్షల తేదీలను కూడా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన, మెయిన్స్‌ను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.