Telangana: గ్రూప్-1, 2, 3 పరీక్షల తేదీలు ఇవే..

తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 4:39 PM IST
telangana, group exams, schedule, tspsc,

Telangana: గ్రూప్-1, 2, 3 పరీక్షల తేదీలు ఇవే.. 

తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గ్రూప్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదలచేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్‌-3 పరీక్షల తేదీలను వెల్లడించింది.

563 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల గ్రూప్‌ -1 నోటిఫకేషన్‌ ఇచ్చారు. ఇ జూన్‌ 6వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అక్టోబర్‌ 21వ తేదీన మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. గత నెల 19వ తేదీన గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు ఉండనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. నవంబర్ 17, 18 వ తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు ఉంటాయని ప్రకటించింది టీఎస్పీఎస్సీ.

783 పోస్టులను భర్తీ చేసేందుకు డిసెంబర్ 2022 డిసెంబర్‌లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. రాష్ట్రాంలో 1,363 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న గ్రూప్‌3 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అదనంగా మరో 12 పోస్టులను చేర్చారు. మొత్తం 1,375 పోస్టుల కోసం 5.36 లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు.





Next Story