Telangana: త్వరలోనే గ్రూప్-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ఇవి ఉన్నాయా? లేదా?
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష రాసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 17 May 2024 11:04 AM GMTTelangana: త్వరలోనే గ్రూప్-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ఇవి ఉన్నాయా? లేదా?
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష రాసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటన చేసింది. త్వరలోనే రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీనే టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. ఇక జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులన 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు.
ఈ మేరకు అభ్యర్థులు ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్స్ వివరాలను కూడా అధికారులు చెప్పారు. వీటిని తప్పకుండా వెరిఫికేషన్ సమయంలో చూపించాల్సి ఉంటుందని తెలిపారు. కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్ (బీసీలకు), పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్, స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్స్ (ఫస్ట్ క్లాస్ నుంచి ఏడో తరగతి వరకు), రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసి పెట్టుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సిద్దంగా ఉంచుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వీటిలో ఏ డాక్యుమెంట్ చూపించలేకపోయినా ఆ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోబోము అని టీఎస్‌పీఎస్‌సీ స్పష్టంగా చెప్పింది. అందుకే వెరిఫికెషన్ తర్వలోనే జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చుకోవాలని సూచించారు.