జాబ్ అలర్ట్.. 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
2,050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 19 Sept 2024 9:00 AM ISTజాబ్ అలర్ట్.. 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
2,050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 17న సీబీటీ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.36,750 - రూ.1,06,990 పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు. జీఎన్‌ఎమ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు.
ఆన్‌లైన్‌లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌కు అవకాశం కల్పించారు. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://mhsrb. telangana.gov.in చూడండి.