బిగ్ న్యూస్ : 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స‌ర్కార్‌ అనుమతి

Telangana Government has given Permission group-4 Posts. తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

By Medi Samrat  Published on  25 Nov 2022 2:02 PM GMT
బిగ్ న్యూస్ : 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స‌ర్కార్‌ అనుమతి
తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం 9168 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తినిచ్చింది తెలంగాణ స‌ర్కార్‌. ఈ పోస్టుల‌ను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ భ‌ర్తీ చేయ‌నుంది. త్వ‌ర‌లో ఈ పోస్టుల‌కు నోటిఫికేషన్ వెలువ‌డ‌నుంది.


వాగ్దానాలు, ఆశయాలను నెరవేర్చే నాయకుడు అయిన సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇంత భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతిని ఇచ్చింది. ఆశావహులకు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి హ‌రీష్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో ట్వీట్ చేశారు.


Next Story