శుభవార్త.. ఎస్‌బీఐలో 10,000 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టబోతోంది. ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో సుమారు 10 వేల మందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు తెలిపారు.

By అంజి  Published on  7 Oct 2024 6:37 AM IST
State Bank of India, recruitment, SBI

శుభవార్త.. ఎస్‌బీఐలో 10,000 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టబోతోంది. ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో సుమారు 10 వేల మందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు తెలిపారు. సాధారణ బ్యాంకింగ్ అవసరాలు, టెక్నికల్‌గా మరింత బలోపేతం అయ్యేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇక ఇటీవలే వివిధ విభాగాల్లో 1500 మంది టెక్నికల్‌ నిపుణులను తీసుకున్నామని తెలిపారు. మొత్తం మీద బ్యాంక్‌కు 8 వేల నుంచి 10 వేల మంది అదనపు ఉద్యోగుల అవసరం ఉందని శ్రీనివాసులు తెలిపారు.

ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంక్‌లో మొత్తం సిబ్బంది 2,32,296 మంది ఉండగా.. వీరిలో 1.10 లక్షల మంది ఆఫీసర్లేనని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ బ్యాంక్‌కు 22,542 శాఖలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మరో 600 శాఖలను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని స్థాయిల్లో ప్రస్తుత సిబ్బందికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఎస్‌బీఐ చైర్మన్‌ తెలిపారు.

Next Story