జూన్‌లో వరుస ఉద్యోగ నోటిఫికేషన్‌లు

వచ్చే నెలలో ఎస్‌ఎస్‌సీ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. జూన్‌ 2న సెలక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

By అంజి
Published on : 25 May 2025 12:28 PM IST

Staff Selection Commission, job notifications, June

జూన్‌లో వరుస ఉద్యోగ నోటిఫికేషన్‌లు

వచ్చే నెలలో ఎస్‌ఎస్‌సీ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. జూన్‌ 2న సెలక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దరఖాస్తులు జూన్‌ 23 వరకు స్వీకరించి, జులై 24 నుంచి ఆగస్టు 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్‌ 5న స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సీ, డీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి, జూన్‌ 26 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు జూన్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఆగస్టు 12న పరీక్షలు నిర్వహిస్తారు. సీజీఎల్‌ పోస్టులకు జూన్‌ 9న నోటిఫికేషన్‌, జులై 4 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆగస్టు 13 నుంచి 30 వరకు పరీక్షలు ఉంటాయి.

జూన్‌ 16న ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌, జులై 7 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సీహెచ్‌ఎస్‌ఎల్‌ పోస్టులకు జూన్‌ 23న నోటిఫికేషన్‌, జులై 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మల్టీ టాస్కింగ్‌,హవల్దార్‌ పోస్టులకు జూన్‌ 26న నోటిఫికేషన్‌ విడుదల చేసి, జులై 24 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 24 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్‌ 30న జూనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌, జులై 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్‌ 27 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Next Story