ఇంటర్ అర్హతతో 7,565 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ -2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
By - అంజి |
ఇంటర్ అర్హతతో 7,565 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ -2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7,565 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ శాఖలో స్థిరమైన ఉద్యోగం కావాలనుకునే యువత కోసం ఇది ప్రత్యేక అవకాశం. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కేవలం ఉద్యోగమే కాకుండా.. దేశ భద్రతలో నేరుగా భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు ఐదు అంచెల ఎన్నిక విధానం ద్వారా ఉద్యోగాన్ని సాధించవలసి వస్తుంది.
1. రాత పరీక్ష 2. పీఈటీ 3. పీఎస్‌టీ 4. సర్టిఫికెట్ల ధ్రువీకరణ 5. మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్
అర్హతలు: వయసు 18 నుంచి 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది)
విద్యార్హత: 12వ తరగతి పాసై ఉండాలి.
ఫిజికల్ టెస్టులు: పొడవు, ఛాతీ, పరుగులు, పుష్ అప్ వంటి ఫిజికల్ టెస్టులు ఉంటాయి.
జీతభత్యాలు: పే లెవల్ 3 (7వ వేతన కమిషన్ ప్రకారం), బేసిక్ +డీఏ+హెచ్‌ఆర్‌ఏ కలిపి రూ. 25,000 - రూ.81,100. ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి.
ఇలా దరఖాస్తు చేసుకోండి
- https://ssc.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్ సెక్షన్‌లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- ఫొటో, సంతకం, విద్యా సర్టిఫికెట్, ఆధార్ అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- దరఖాస్తును సమర్పించి అప్లికేషన్ నంబర్ ప్రింట్ చేసుకోవాలి.
పరీక్ష విధానం
100 మార్కులకు సీబీటీ విధానంలో పరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు 50 మార్కులు, రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, న్యూమరికల్ అబిలిటీ 15 ప్రశ్నలు 15 మార్కులు, కంప్యూటర్ ఫండమెంటల్స్ 10 ప్రశ్నలు 10 మార్కులు.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కు కలదు.