భారీగా ఉద్యోగాలు.. 10వ తరగతి అర్హతతో 39,481 పోస్టులు
కేంద్ర భద్రతా బలగాల్లో 39,481 కానిస్టేబుల్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులు కోరుతోంది.
By అంజి
భారీగా ఉద్యోగాలు.. 10వ తరగతి అర్హతతో 39,481 పోస్టులు
కేంద్ర భద్రతా బలగాల్లో 39,481 కానిస్టేబుల్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులు కోరుతోంది. పదవ తరగతి అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 14లోపు దరఖాస్తు చేసుకోగలరు. మొత్తం పోస్టుల్లో బీఎస్‌ఎఫ్‌లో 15,654 పోస్టులు, సీఐఎస్‌ఎఫ్‌లో 7,145 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 11,541 పోస్టులు, ఎస్‌ఎస్‌బీలో 819 పోస్టులు, ఐటీబీపీలో 3,017 పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో 1248 పోస్టులు, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 35 పోస్టులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 22 పోస్టులు ఉన్నాయి.
ఇందులో మహిళలకు 3,869 పోస్టులు కేటాయించారు. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎక్స్, సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షను 160 మార్కులకు సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, నెగెటివ్ మార్కులు ఉంటాయి.