స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1146 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి అప్లై గడువును పొడిగించింది. తొలుత 996 పోస్టులను ప్రకటించగా.. మరో 150 పోస్టులను కలిపి గడువును జనవరి 10వ తేదీ వరకు పెంచింది. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, సీఎఫ్‌పీ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వీపీ వెల్త్, ఏవీపీ వెల్త్, సీఆర్‌ఈ పోస్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు sbi.bank.inను విజిట్ చేయండి.
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1146 ఖాళీలను SBI SO నోటిఫికేషన్ 2025 ద్వారా భర్తీ చేస్తారు. SBI SO రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఆన్‌లైన్ ఫారమ్-ఫిల్లింగ్ ప్రక్రియను మళ్ళీ జనవరి 10, 2026 వరకు పొడిగించారు, కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ని సందర్శించి ఇప్పుడే తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.