ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ల్లో ఉద్యోగం చేసి రిటైరైన వారి అనుభవాన్ని, సేవలను వినియోగించుకోవడం కోసం వారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ గా నియమించనున్నారు. అర్హులైన వారు ఈ నెల 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 48 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు 868 కాగా.. ఇందులో జనరల్ 379, ఎస్సీ 136, ఎస్టీ 57, ఓబీసీ 216, ఈడబ్ల్యూఎస్ 80, పీడబ్ల్యూడీ 45 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులై ఉండాలి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు, సస్పెండ్ అయినవారు, ఉద్యోగానికి రాజీనామా చేసిన వారు అప్లయ్ చేసుకోవడానికి అనర్హులు.
వయస్సు : అభ్యర్థులు 2023 మార్చి 10 నాటికి 63 ఏళ్లు లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్: sbi.co.in
రిజిస్ట్రేషన్లకు చివరితేదీ: మార్చి 31