నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు
SBI Recruitment 2022 Notification over 5000 Junior Associate posts.ఎస్‌బీఐ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది.
By తోట వంశీ కుమార్ Published on 7 Sep 2022 5:26 AM GMTనిరుద్యోగులకు శుభవార్త. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచీల్లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలో 5,008 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరులో మెయిన్ పరీక్ష ఉండనుంది.
ఖాళీలు ఇలా..
అహ్మదాబాద్‌లో 357, బెంగళూరులో 316, భోపాల్‌లో 48, బెంగాల్‌లో 376, భువనేశ్వర్‌లో 170, చండీగఢ్‌లో 225, చెన్నైలో 362, ఢిల్లీలో 152, హైదరాబాద్‌లో 225, జైపుర్‌లో 284, కేరళలో 273, ఢిల్లీలో 631, ముంబైలో 747, మహారాష్ట్రలో 50, నార్త్ ఈస్టర్న్‌లో 359
మరిన్ని వివరాలు..
విద్యార్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ (జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,99,00
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2022.
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 12.10.2022.
ప్రిలిమినరీ పరీక్ష: 2022 నవంబర్‌లో
మెయిన్ పరీక్ష : డిసెంబర్ 2022/ జనవరి 2023లో ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఇవే..
అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.