నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎస్‌బీఐలో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

SBI PO 2021 Notification Out.నిరుద్యోగుల‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శుభ‌వార్త చెప్పింది. 2,056 ప్రొబేషనరీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Oct 2021 6:49 AM GMT
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎస్‌బీఐలో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

నిరుద్యోగుల‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శుభ‌వార్త చెప్పింది. 2,056 ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 2000 పోస్టులు రెగ్యుల‌ర్ నియామ‌కాలు కాగా.. 56 బ్యాక్‌లాగ్ పోస్టులు. ఆన్‌లైన్ ద్వారానే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేటి నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుండ‌గా.. అక్టోబ‌ర్ 25 చివ‌రి తేదీ. మొత్తంమూడు ద‌శ‌ల్లో నియామ‌క ప్ర‌క్రియ ఉంటుంది. తొలుత ప్రిలిమ్స్‌, ఆ త‌రువాత మెయిన్స్ అనంత‌రం ఇంట‌ర్వ్యూ ద్వారా ఉద్యోగుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

* అర్హ‌తలు - ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

* వ‌య‌సు - 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

* దరఖాస్తు ఫీజు - జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

* ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌/డిసెంబర్‌ 2021

* పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.

* ఎంపిక విధానం- ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Next Story