నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
SBI Clerk Recruitment 2021 Registration date extended.ఎస్‌బీఐ 5వేలకు పైగా క్లరికల్ క్యాడర్‌లో కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది.
By తోట వంశీ కుమార్ Published on 16 May 2021 7:47 AM GMTనిరుద్యోగులకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఎస్‌బీఐ 5వేలకు పైగా క్లరికల్ క్యాడర్‌లో కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం రేపటితో (మే 17)తో దరఖాస్తు గడువు ముగయనుండగా.. మరో మూడు రోజుల పాటు పెంచింది. దీంతో ఈ నెల 20వ (మే 20) తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయినవారు లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్స్ అయిన https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers లలో అప్లై చేయాలి. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రంలో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకోండి.
- అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- 'Latest Announcements' ట్యాబ్ పైన క్లిక్ చేస్తే 'Recruitment of Junior Associates (Customer support & Sales)' నోటిఫికేషన్ కనిపిస్తుంది.
- అందులో Advertisement పైన క్లిక్ చేస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.
- నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
- అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు 'Apply Online' పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- కొత్త పేజీలో 'Click Here for New Registration' పైన క్లిక్ చేయాలి.
- మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
- మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని గుర్తుంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కు ఈ వివరాలు వస్తాయి.
- ఆ తర్వాత స్టెప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
- మీ ఫోటో, సంతకం, ఎడమచేతి బొటన వేలిముద్ర, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
- ఫీజు చెల్లించిన తర్వాత చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ఎంపిక విధానం : మూడు విభాగాలుగా ఉంటుంది.
- మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మార్కులను ప్రశ్నలు ఇస్తారు. అన్ని ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షను గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
- రెండో దశ.. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆజ్జెక్టివి విధానంలో ఉంటాయి. పరీక్షను 2.40 గంటల్లో పూర్తిచేయాలి.
- వీటిలో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 20
ప్రిలిమినరీ రాతపరీక్ష: జూన్ నెలలో
మెయిన్ పరీక్ష: జూలై 31