దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) పోస్టులకు అభ్యర్థులను నియమించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటా ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6589 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 5180 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగతావి బ్యాక్ లాగ్ పోస్టులు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 310, తెలంగాణలో 250 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్లు, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నవారు అర్హులు. వయసు 20 నుంచి 28 మధ్య ఉండాలి.
ప్రిలిమినరీ, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అధికారిక నోటిఫికేషన్ PDF ని ఆగస్టు 5, 2025న అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careersలో విడుదల చేశారు. ఈ జాబ్స్‌కి ఎంపికైన వారికి జీతం రూ.46000 వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ధృవీకరించబడిన తేదీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటిస్తుంది. అన్ని ముఖ్యమైన తేదీలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.