నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు
SBI CBO Recruitment 2021 For 1226 Circle Based Officer Posts.నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
By తోట వంశీ కుమార్ Published on 13 Dec 2021 11:06 AM ISTనిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీఓ) పోస్టుల్ని భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో 1100 పోస్టులు రెగ్యులర్ కాగా.. 126 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. డిసెంబర్ 29 చివరి తేదీ. 2022 జవరిలో ఆన్‌టైన్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా దరఖాస్తులు సబ్మిట్ చేస్తే అప్లికేషన్స్ స్వీకరించరు.
ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని ఎస్బీఐ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ. 36వేలుగా ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, మెడికల్ అలవెన్సులు అదనంగా ఉండనున్నాయి.నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
- మొత్తం ఖాళీలు 1,226( రెగ్యులర్- 1100, బ్యాక్ లాగ్- 126)
- అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అదేవిధంగా వయసు 2021 డిసెంబర్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతరులకు మాత్రం రూ.750
- రిజిస్ట్రేషన్‌కు చివరితేది : డిసెంబర్ 29
- 2022 జనవరిలో ఆన్‌లైన్ పరీక్ష
-బేసిక్ సాలరీ 36వేలు+(సర్వీస్ లో ఒక్కో ఏడాదికి ఒక ఇంక్రిమెంట్). డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, మెడికల్, ఇతర అలవెన్స్ లకు అదనం
- వెబ్ సైట్.. sbi.co.in