రైల్వేలో టెన్త్‌ అర్హతతో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలక సమయం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన...

By -  అంజి
Published on : 8 March 2026 10:45 AM IST

Railway Group-D Recruitment 2026, RRB Jobs Notification, 22,195 Vacancies, Indian Railways Career, 10th Pass Govt Jobs, ITI Railway Jobs, Last date to apply for RRB Group-D, Railway Recruitment Board Online Application

రైల్వేలో టెన్త్‌ అర్హతతో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలక సమయం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన వేల సంఖ్యలోని గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు గడువు ముగియనుంది. రైల్వేలో 22,195 గ్రూప్‌-డి ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పాయింట్స్‌మన్‌, ట్రాక్‌ మెయింటెనర్‌, అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 1,012 పోస్టులు ఉన్నాయి. రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. మార్చి 9, 2026 తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. టెన్త్ లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలి. 18 నుండి 33 ఏళ్లు (రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది) ఉన్న వారు అర్హులు. ప్రారంభ వేతనం నెలకు రూ. 18,000 (ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి)గా ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

ఎంపిక విధానం

అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

షార్ట్‌లిస్టింగ్: దరఖాస్తుల పరిశీలన.

CBT (Computer Based Test): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష.

PET (Physical Efficiency Test): శారీరక సామర్థ్య పరీక్షలు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: ధృవీకరణ పత్రాల పరిశీలన.

మెడికల్ టెస్ట్: వైద్య పరీక్షలు.

దరఖాస్తు ఫీజు:

SC, ST, PwBD, మరియు మహిళా అభ్యర్థులకు: రూ. 250

ఇతర అభ్యర్థులకు (General/OBC): రూ. 500

ఎలా అప్లై చేయాలి?

ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, వెంటనే అప్లై చేయడం ఉత్తమం.

Next Story