రైల్వేలో 2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
By - అంజి |
రైల్వేలో 2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 103 పోస్టులు న్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హతగల అభ్యర్థులు నంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి వయస్సులో మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష (సీబీటీ -1, సీబీటీ -2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రచురించింది. జూనియర్ ఇంజనీర్ (సేఫ్టీ & నాన్-సేఫ్టీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ సూపర్‌వైజర్ & మెటలర్జికల్ సూపర్‌వైజర్ కోసం నోటిఫికేషన్‌ను ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్ లో విడుదల చేశారు. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 31, 2025 - నవంబర్ 30, 2025 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఫీజు చెల్లించు గడువు డిసెంబర్ 2, 2025 వరకు, దరఖాస్తు దిద్దుబాటు విండో డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 12, 2025 వరకు తెరిచి ఉంటుంది. రీఫండ్ ప్రయోజనాల కోసం అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
- ముందుగా మీ ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి
- RRB JE 2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రర్ చేసుకోండి.
- వ్యక్తిగత, విద్యా వివరాలతో ఫారమ్ నింపండి.
- ఫొటో, సంతకం, పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- నవంబర్ 30, 2025 లోపు రుసుము చెల్లించి దరఖాస్తును సమర్పించండి.






