32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదిగో..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్‌బీ) 32,438 లెవల్ -1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By అంజి Published on 22 Jan 2025 8:26 AM IST32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్‌బీ) 32,438 లెవల్ -1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాస్ అయిన వారు అర్హులు. వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. ఫిబ్రవరి 25 నుండి మార్చి 06 వరకు అప్లికేషన్‌లో సవరణలు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం http://www.rrbcdg.gov.in/ ఇక్కడ క్లిక్ చేయండి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్-IV, టెక్నికల్ విభాగాలు (ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు S&T) హెల్పర్/అసిస్టెంట్, అసిస్టెంట్ పాయింట్స్‌మన్, ఇతర లెవల్-1 పాత్రల వంటి వివిధ విభాగాల్లో లెవల్ 1 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులకు 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి:
జనరల్ సైన్స్ - 25 ప్రశ్నలు
మ్యాథమెటిక్స్ - 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - 30 మార్కులకు 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ - 30 మార్కులకు 30 ప్రశ్నలు.
సీబీటీలో తప్పు సమాధానాలకు ప్రతికూల మార్కులు ఉంటాయి.
పోస్టులు ఇవే
పాయింట్స్‌మన్-బి- 5058
అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
అసిస్టెంట్ (వంతెన)- 301
ట్రాక్ మెయింటెయినర్ Gr. IV- 13187
అసిస్టెంట్ పి-వే - 247
అసిస్టెంట్ (C&W)- 2587
అసిస్టెంట్ TRD -1381
అసిస్టెంట్ (S&T)- 2012
అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్)- 420
అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950
అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)- 744
అసిస్టెంట్ TL & AC- 1041
అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్)- 624
అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్)- 3077