ఓరాకిల్‌లో భారీగా ఉద్యోగాల కోత.. ఒక్క మెయిల్‌తో 30,000 మంది ఇంటికి

టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ...

By -  అంజి
Published on : 1 April 2026 9:50 AM IST

Oracle Layoffs 2026, Workforce Reduction,Artificial Intelligence Investments, Severance Package,Job Redundancy, Tech Industry Job Cuts, Organizational Restructuring

ఓరాకిల్‌లో ఉద్యోగాల కోత: ఒక్క మెయిల్‌తో 30,000 మంది ఇంటికి 

టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, కంపెనీ పెద్ద ఎత్తున లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యంగా భారతదేశంలోని ఒరాకిల్ ఉద్యోగులపై దీని ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. తెల్లవారుజామున 5 నుండి 6 గంటల సమయంలోనే ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపడం ద్వారా వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ సమాచారం అందించింది.

భారతదేశంలో సుమారు 30,000 మంది ఒరాకిల్ ఉద్యోగులు ఉండగా, అందులో దాదాపు 12,000 మందిని (సుమారు 40%) తొలగించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ (ANI) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం ఉద్యోగుల్లో 18 శాతం మందిని, అంటే సుమారు 30,000 మందిని తొలగించినట్లు అంచనా. మెక్సికో మరియు భారత్‌లోని కంప్యూటింగ్ బిజినెస్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, హెచ్ఆర్ చర్చలు జరపకుండానే నేరుగా 'ఒరాకిల్ లీడర్‌షిప్' నుంచి ఈమెయిల్స్ రావడం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈమెయిల్ అందిన వెంటనే చాలామందికి కంపెనీ అంతర్గత వ్యవస్థల (Internal Systems) యాక్సెస్ కూడా నిలిపివేశారు.

నిర్వహణను క్రమబద్ధీకరించే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ అంతర్గత సమాచారంలో పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచేందుకు వనరులను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగానే ఈ కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ వంటి ఇతర టెక్ కంపెనీలు కూడా ఏఐ కోసం ఖర్చులను పెంచుతూ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో ఇంకొక విడత లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందనే వార్తలు ఉద్యోగుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

తొలగించిన ఉద్యోగులకు కంపెనీ పరిహారం (Severance Package) ప్రకటించింది. ఇందులో ప్రతి ఏడాది సర్వీసుకి 15 రోజుల జీతం, ఒక నెల నోటీసు పే, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ మరియు రెండు నెలల అదనపు జీతాన్ని అందిస్తోంది. అయితే, ఈ ప్యాకేజీని స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వారికి మాత్రమే వర్తింపజేస్తున్నట్లు సమాచారం. అమెరికాలో స్థానిక చట్టాలు కఠినంగా ఉండటం వల్ల, అక్కడ పనిచేస్తున్న భారతీయులపైనే ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా పడిందని కొందరు మాజీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Next Story