ఆర్‌ఆర్‌బీలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులు మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు ఉన్నాయి. టెన్త్‌తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయో పరిమితి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్ల సడలింపు ఉంటంఉది. ఫస్ట్ స్టేజ్ సీబీటీ, సెకండ్ స్టేజ్ సీబీటీ, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250. ఆసక్తి గల అభ్యర్థులు https://www.rrbapply.gov.in/లో అప్లై చేసుకోవచ్చు.